33.2 C
India
Monday, February 26, 2024
More

    Sujana Chaudhary : విజయవాడ ఎంపీ రేసు లో సుజనా చౌదరి?

    Date:

    Sujana Chaudhary
    Sujana Chaudhary
    Sujana Chaudhary : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  తెలుగుదేశం పార్టీలో  విజయవాడ ఎంపీ ఎవరు అన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. కేశినేని నానికి టిక్కెట్ ఇవ్వమని పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ టికెట్ కోసం మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం అందుతుంది. బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే విజయవాడ ఎంపీ టికెట్ తనక ఇవ్వాలని పార్టీ పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.
    ఒకవేళ బిజెపి పొత్తులో టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలో చేరి కచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని సుజనా చౌదరి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేశినేని నాని కూడా సుజనా చౌదరికి టికెట్ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని టిడిపి అధిష్టానానికి చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ సుజనా చౌదరికి టికెట్ ఇవ్వకపోతే నాకే ఆ టికెట్ ఇవ్వాలని కేశినేని నాని పట్టుబడుతున్నారు. మొత్తం మీద అటు వైసీపీలోను ఇటు తెలుగుదేశం పార్టీలోనూ టికెట్ల గోల గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. సుజనా చౌదరికి టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keshineni Vs PVP : కేశినేని ఆవేదన.. పొట్లూరి వరప్రసాద్ సెటైర్

    Keshineni Vs PVP : విజయవాడ  రాజకీయం రోజురోజుకు వేడెక్కు తుంది....

    Keshineni Nani : ఇక టీడీపీలో ఉండలేను రాజీనామా చేస్తా : కేశినేని నాని

    Keshineni Nani : త్వరలో టిడిపికి రాజీనామా చేస్తానని విజయ వాడ ఎంపీ...