32.3 C
India
Friday, March 29, 2024
More

    ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా సుకేశ్ చంద్రశేఖర్ లేఖలు.. తెర వెనుక ఎవరు ?

    Date:

    Sukesh Chandrasekhar
    Sukesh Chandrasekhar

    Sukesh Chandrasekhar : ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. ఈడీ సైలెంట్ అయ్యింది. ఎమ్మెల్సీ కవిత కూడా బీజేపీని చీటికీ, మాటికీ విమర్శించడం మానేసింది. అయితే జైల్లో ఉన్న మనీలాండరింగ్ కింగ్ సుఖేశ్ చంద్రశేఖర్ మాత్రం కవితక్కను టార్గెట్ చేస్తూ లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఆమెను కవితక్కగా పిలిచే సుఖేశ్ చంద్రశేఖర్  ఎందుకు ఆమెను టార్గెట్ చేశారన్న దానిపై చర్చ కొనసాగుతోది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి షెల్ కంపెనీల గురించి లేఖ విడుదల చేశారు సకేశ్ చంద్రశేఖర్.

    మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కవితకు సంబంధించిన షెల్ అకౌంట్ల నుండి ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లాట్ కజిన్కు చెందిన ‘గ్రీన్ హస్క్’ అనే మారిషస్ కంపనీకి కోట్లాది రూపాయలు బదిలీ చేసినట్లు సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు. ఢిల్లీ సీఎం ఆదేశాలతో 3 విడుతల్లో రూ.80 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు వివరించాడు. ఈ డబ్బును యూఎస్ బీసీ, క్రిప్టోకరెన్సీకి మార్చిన అనంతరం ఢిల్లీ సీఎం సూచనలతో అబుదాబికి పంపినట్లు చెప్పాడు. ఈ మేరకు సుఖేశ్ తన అడ్వకేట్ అనంత్ మాలిక్ ద్వారా బుధవారం (మే 24) రోజున నాలుగు పేజీల లేఖను రిలీజ్ చేశాడు.

    దీనిపై కేజ్రీవాల్‌తో జరిపిన ‘ఫేస్‌‌ టైమ్’ చాట్‌‌కు స్క్రీన్ షాట్లను త్వరలో విడుదల చేస్తానని సస్పెన్స్ లో పెట్టాడు సుకేశ్. ఇందులో  కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై ఆరోపణలు చేశాడు. ఆ ఇంటి ఫర్నీచర్ కు అయిన ఖర్చును తానే భరించానని, దీనికి సంబంధించిన బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. వాస్తవాలను బయట పెడుతున్నందుకే కొందరు అధికారుల ద్వారా తనను మానసికంగా వేధిస్తున్నారని లేఖలో ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. జైల్లో ఉంటూ లేఖలు రాయాలంటే అంత సులభం కారు. కానీ సుకేశ్ సులువుగా లేఖలు బయటకు విడుదల చేస్తున్నారు. ఈ లేఖల్లో కవితకు సంబంధించిన వివరాలు బయటపెడుతూనే ఉన్నారు.

    సుకేశ్ లేఖలు విడుదల చేసిన ప్రతీ సారి కవిత స్పందించడం చూస్తున్నాం. తప్పుడు ప్రచారం అంటూ ఆమె కొట్టేస్తున్నారు. కానీ ఇటీవల ఆమె స్పందించడం మానేసింది. ఇప్పుడు ఈ లేఖ విషయంలోనూ కూడా ఆమె స్పందించదని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM : స్వయంగా వాదనలు వినిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Delhi CM : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అర...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు జైలులో సౌకర్యాల కల్పనకు.. కోర్టు అనుమతి..

    MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్...

    MLC Kavitha : కుమారుడు ఎగ్జామ్స్ బెయిల్ కోరిన కవిత..

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె...

    Kavitha : కవితకు బెయిల్ రాకపోతే తీహారు జైలుకేనా..? 

    Kavitha :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ...