- లడ్డూ కౌంటర్లపై సరికొత్త ఆదేశాలు

Summer rush in Tirumala TTD key decision : తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నది. వేసవి సెలవులు రావడం ఇందుకు కారణమైంది. వారంతంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటున్నది. సర్వదర్శనం కంపార్లమెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే రద్దీ దృష్ట్యా టీటీడీ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనసంద్రంలా తిరుమల..
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. సర్వదర్శనానినికి వచ్చే భక్తులతో క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడుతన్నది. ఇక వేంకటేశ్వరుడి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. ఒక్క గురువారమే 67853 మంది భక్తులు దేవదేవుడిని దర్శించుకున్నారు. అయితే గురువారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు వచ్చినట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది.33 వేల మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు పేర్కొంది. స్వామివారి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా సాగినట్లు టీటీడీ పేర్కొంది.
అయితే వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరుగుతున్నది. ఇందుకు అవసరమైన చర్యలన్నీ అధికార యంత్రాంగం తీసుకుంటున్నది. మరికొన్ని లడ్డూ కౌంటర్ల ఏర్పాటు పై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే గురువారం స్వర్ణరథంపై దేవదేవుడి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. స్వర్ణ రథంపై దేవదేవుడు నాలుగు మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు భక్తులు గోవిందనామస్మరణలో మునిగి తేలారు.
బ్యాంక్ అధికారులతో ఈవో సమీక్ష..
టీటీడీ ఈవో బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ వద్ద ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం కొనసాగింది. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించాలని ఆయన టీటీడీ ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు.