
2022 సంవత్సరానికి సుందర్ పిచాయ్ వేతనం రూ. 226 మిలియన్ డాలర్లు గా ఉంది. మన దేశ కరెన్సీలో రూ.1800 కోట్లు అని తేలింది. స్టాక్ అవార్డుల ద్వారా 218 మిలియన్ డాలర్లు వచ్చాయి. సుందర్ పిచాయ్ పారితోషికం వివరాలు అల్ఫాబెట్ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు వెల్లడించింది. సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సగటు ఉద్యోగి సీఈవో వేతనంలో భారీ తేడా ఉంది. దీంతో గూగుల్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వేలాది మందిని తొలగిస్తూ సీఈవో వేతనం ఇలా పెంచడంలో ఆంతర్యమేమిటో అర్థం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. పిచాయ్ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. సుందర్ పిచాయ్ వేతనంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ గత ఏడాది జనవరిలో ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గూగుల్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు భయపడుతున్నారు. తమ ఉద్యోగం ఎక్కడ పోతుందనే ఆందోళన చెందుతున్నారు. పిచాయ్ పారితోషికంపై మిలియన్ డాలర్ల ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.






