
Sunil strategies have built power in Kannada Next for Telangana : కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ముందు నుంచి ఊహించిందే. అక్కడి రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తాడు. దీని గురించి ఇక రాజకీయ నాయకుల వ్యూహం ఎందుకో అర్థం కావడం లేదు. కొన్నేళ్లుగా కర్ణాటక ఓటర్లు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్ కు అత్యంత స్పష్టమైన, భారీ మెజారిటీ కట్టబెట్టారు.
అయితే ఈ సారి కాంగ్రెస్ గెలుపు వెనుక రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు వ్యూహాలు (Sunil strategies) ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, కాంగ్రెస్ మేనిఫేస్టో రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక ఇలా అన్నింట్లో ఆయన ‘హస్త’వాసి బాగుందనే టాక్ వినిపిస్తుంది. హంగూ ఆర్భటం, ప్రచారం ఇవేవీవ లేకుండా తన పని తాను చేసుకుపోయేవాడు సునీల్ కానుగోలు.
ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ నేత రాహుల్ కు సలహాలు ఇస్తూ కీలకంగా మారారు. గతేడాది బీజేపీని వీడిని ఆయన కాంగ్రెస్ కు పని చేశారు. ఆయన జన్మస్థలం కూడా కర్ణాటక కావడంతో కంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు ఆయన. ఈ విజయంతో ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా మారాడు. బీజేపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రూపొందిస్తూ ఆయన రోజూ 20 గంటల పాటు శ్రమించారట.
వర్గపోరు కాంగ్రెస్ కామనే. సునీల్ పార్టీలోకి వచ్చే నాటికి అది తీవ్రంగా ఉంది. ఈ పరిస్ధితుల్లో రాహుల్-ప్రియాంక గాంధీ మద్దతుతో వ్యూహాలు రచించే బాధ్యత తీసుకున్నారు సునీల్.
సీఎం బొమ్మైకు సన్నిహితుడైన సునీల్ ను తిరిగి బీజేపీలోకి తీసుకచ్చేలా తీవ్రంగా ప్రయత్నాలు సాగాయి. కానీ ఆయన వీటిని సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో రాహుల్ భారత్ జోడో యాత్ర చేయాలని సునీల్ సూచించారు. ఆయన అభ్యర్థన మేరకు రాహుల్ ఈ యాత్ర చేపట్టారు. కర్ణాటకలోనూ ఈ యాత్ర సాగింది. ఈ యాత్రతో వర్గపోరులో ఉన్న డీకే శివకుమార్, సిద్ధ రామయ్య వర్గాలను ఆయన ఏకతాటిపైకి తేవడంలో సఫలీకృతుడయ్యాడు.
నాయకుల మధ్య సయోధ్య కుదరడంతో మేనిఫేస్టో రూపకల్పనలో పడ్డాడు సునీల్ కానుగోలు. అందులో పొందు పరిచిన పథకాల వెనుక సునీల్ పాత్ర విశేషంగా కనిపిస్తుంది. ఈ విజయంతో ఈ ఏడాది చివరలో జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన వ్యూహాలు రచించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో కనీసం రెండింటిలో విజయం సాధిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పని చేసే అవకాశాన్ని ఆయన పొందనున్నారు. ఏది ఏమైనా ఊహించిన ఈ విజయంలో సీఎం నుంచి వ్యూహకర్త కూడా అదృష్టవంతుడనే చెప్పవచ్చు.