
Sunitha Williams : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బుచ్ విల్మోర్(Buch Wilmore) సుమారు తొమ్మిది నెలల అంతరిక్ష వాసం తర్వాత భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి బయల్దేరిన వీరు, బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరం సమీపంలోని సముద్రంలో విజయవంతంగా దిగారు. ఈ ప్రయాణంలో వ్యోమనౌక గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చి, క్రమంగా వేగం తగ్గించుకుంది. గంటకు 116 మైళ్ల వేగానికి చేరుకున్న తర్వాత నాలుగు పారాచూట్ల సాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయింది.