
HBD Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి.. ఈయన ఇప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమా చేయకపోయినా మహేష్ రేంజ్ అండ్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదు.. బాల నటుడిగానే కెరీర్ స్టార్ట్ చేసిన మహేష్ చిన్న వయసులోనే తన సత్తా నిరూపించుకున్నాడు.. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..
అప్పటి నుండి కెరీర్ లో ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చిన తట్టుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే యాడ్స్ ద్వారా కూడా రెండు చేతులా వందల కోట్లను సంపాదిస్తున్నాడు.. అలాగే ఆ డబ్బును సమాజసేవ కోసం కూడా ఉపయోగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మరి అలంటి సూపర్ స్టార్ మహేష్ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.. మహేష్ ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా వివాదాల జోలికి మాత్రం పోలేదు.. కెరీర్ లో క్లీన్ పర్సన్ గా పేరు తెచ్చుకుని హీరోల నుండి డైరెక్టర్ల వరకు అందరితో స్నేహంగా ఉంటాడు.. ఈ లక్షణం కూడా ఈయనను స్టార్ హీరోగా నిలబెట్టింది..
మూవీస్, యాడ్స్,బిజినెస్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు.. అయితే ఈయన నిజ జీవితంలో రియల్ హీరో అనిపించు కున్నాడు.. ఆ మధ్య గుంటూరు లోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని వసతులతో తీర్చిదిద్దాడు.. ఇక ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు.. ఈ రెండు ఊర్లకు ఏ లోటు లేకుండా చూస్తున్నాడు..
అలాగే వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి చిరునవ్వుకు కారణం అయ్యాడు.. ఒక్కో సినిమాకు 60 కోట్ల వరకు తీసుకుంటున్న మహేష్ యాడ్స్ ద్వారా కూడా ఏడాదికి 10 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.. ఈయన ఎంత సంపాదన ఉన్న సామజిక సేవ ద్వారా ఎన్నో కోట్లను ఖర్చు చేస్తున్న ఏకైక హీరోగా నిలుస్తున్నాడు.. మరి అలంటి మహేష్ ఎప్పుడు అన్నిటిలో విజయం సాధించాలని కోరుకుందాం..






