Supreme Court :
2019 ఎన్నికల సందర్భంగా మోడీ ఇంటిపేరును ఊటంకిస్తూ మోడీలు అవినీతిపరులు అంటూ ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోడీ ఇంటి పేరున్న ఒకరు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సూరత్ షెషన్స్ కోర్టు 2023, మార్చి 23న ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే పార్లమెంట్ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని తొలగించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన వారు పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు. పైగా ఆరేళ్ల పాటు వీరు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయవద్దు.
సూరత్ కోర్టు విధించిన శిక్షపై అహ్మదాబాద్ కోర్టులో సవాల్ చేయడంతో అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ నెల 4వ తేదీన విచారణ జరిపిన కోర్టు జైలు శిక్షపై స్టే విధించింది. కోర్టు నిర్ణయం మేరకు సచివాలయం ఆయనపై ఉన్న అనర్హత వేటును తొలగించింది. నేడు (ఆగస్ట్ 7) నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలోని 10 జన్‌పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకొన్నాయి.
తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.
ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం (ఆగస్ట్ 8వ) నుంచి చర్చ జరగనుంది. ఈ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అనర్హత వేటు నుంచి బయటపడడంతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.
ReplyForward
|