Surat Diamond Bourse : ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేస్తూ ప్రసిద్ధి చెందిన సూరత్.. ఇప్పుడు దాని అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు అనుగుణంగా ఒక గొప్ప భవనాన్ని ఏర్పాటు చేసుకుంది. నగరంలో ఇటీవలే ప్రారంభించబడిన సూరత్ డైమండ్ బోర్స్ కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం ఒక సమగ్ర కేంద్రాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా పేరుగాంచింది. అమెరికా పెంటగాన్ కార్యాలయాన్ని దాటేసింది.
7.1 మిలియన్ చదరపు అడుగుల అంతస్తు స్థలంతో, ఇది పెంటగాన్ ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా సూరత్ ఆఫీస్ నిలిచింది. 15-అంతస్తుల కాంప్లెక్స్‌తో 35 ఎకరాల విస్తీర్ణంలో ఆకట్టుకునేలా తొమ్మిది ఇంటర్‌కనెక్టడ్ దీర్ఘచతురస్రాకార నిర్మాణాల ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది.
కోవిడ్-సంబంధిత జాప్యాల కారణంగా పాక్షికంగా జాప్యం జరిగింది. నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న నిర్మాణ పనుల తర్వాత, సూరత్ డైమండ్ బోర్స్ నవంబర్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది చివర్లో అధికారికంగా ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.
బోర్స్ 4,700 కంటే ఎక్కువ కార్యాలయ స్థలాలను కలిగి ఉంది. ఇవి చిన్న డైమండ్-కటింగ్ , పాలిషింగ్ వర్క్‌షాప్‌లుగా కూడా ఉపయోగపడతాయి. అభివృద్ధిలో 131 ఎలివేటర్లు, అలాగే డైనింగ్, రిటైల్, వెల్నెస్ , కార్మికుల కోసం సమావేశ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
– సూరత్ డైమండ్ ఇండస్ట్రీ వృద్ధి
ఈ విశిష్ట భవనాన్ని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ, “సూరత్ డైమండ్ బోర్స్ సూరత్ వజ్రాల పరిశ్రమ యొక్క చైతన్యాన్ని ,వృద్ధిని సూచిస్తుంది. ఇది భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు.. సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఇది మరింత వృద్ధి చెందుతుంది. మన ఆర్థిక వ్యవస్థ. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది” అని ట్వీట్ చేశారు.
Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat's diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv
— Narendra Modi (@narendramodi) July 19, 2023