Surekha Vani in Drugs case :
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. డ్రగ్స్ మాఫియా రావణకాష్టం లాంటిది. రావణ కాష్టం కూడా ఎప్పుడు రగులుతూనే ఉంటుందట. మన తెలుగు తారలు డ్రగ్స్ కేసులో ఎప్పుడు పట్టుబడటం తరువాత ఓ వారం పది రోజులు దానిపై చర్చ జరగడం మామూలే. తరువాత దాన్ని మరచిపోతుంటారు.
తాజాగా డ్రగ్స్ తీగ లాగితే డొంకంతా కదులుతోంది. మాదాపూర్ ఎస్వోటీ, రాజేంద్ర నగర్ పోలీసులు కిస్మత్ పురలో అరెస్టు చేసిన కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి వెల్లడించిన వివరాల ఆధారంగా పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈనెల 12న రాత్రి అదుపులోకి తీసుకుని ఉప్పరపల్లి కోర్టు అనుమతితో రాజేంద్రనగర్ పోలీసులు అతడిని కస్టడీలోకి తీుకుని విచారించారు. దీంతో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.
మొబైల్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను డీకోడ్ చేసి వాటి ఆధారంగా వివరాలు తెలుసుకుంటున్నారు. చౌదరి కాల్ లిస్ట్, వాట్సాప్ స్టేటస్, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి, సినీ నటి సురేఖ వాణి ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సురేఖ వాణి స్పందించింది. డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. దీంతో తమ పిల్లల భవిష్యత్, కుటుంబ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
మొత్తానికి డ్రగ్స్ కేసు మరోమారు సంచలనం సృష్టించింది. గతంలో కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రవితేజ, హీరోయిన్ చార్మి వంటి వారిపై ఆరోపణలు వచ్చినా అదంతా ఏం తేల్చకుండానే కేసు సమసిపోయింది. తరువాత కూడా నాగబాబు కూతురు నిహారిక సైతం ఓ వేడక సందర్భంలో దొరికిపోయినా అది కూడా ఎటూ తేలలేదు. ఇలా వారు దొరికిపోవడం మళ్లీ ఏం తేలకుండా పోవడం పరిపాటిగా మారింది.