
AP cm jagan : రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాని ఏపీ సీఎం జగన్ లక్ష్యం పెట్టుకున్నారు. ఆ దిశగా రాష్ర్టంలోసంక్షేమ కార్యక్రమాల జోరు కూడా పెంచారు. కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నాడు. నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. పని తీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నట్లు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
అయితే సర్వే బాధ్యతలను సొంత పార్టీ నేతలకే అప్పగించడమే ఆయన చేసిన తప్పు. తనకు సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలను కోట్లాది రూపాయలు పెట్టి మరీ సర్వేలు చేయించుకుంటున్నారు. సొంత పార్టీ నేతలకే సర్వే బాధ్యతలు అప్పగిస్తే పారదర్శకంగా నివేదికలు ఎలా వస్తాయన్న చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఇద్దరు వైసీపీ నేతలు కలిసినప్పుడల్లా ఫలానా నేతలు సర్వేలు చేయించి… అధినేత ఆమోదం కోసం గ్రౌండ్ లెవెల్ లో ఉన్న దానికి భిన్నంగా నివేదికలు సమర్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్లు వచ్చే అవకాశం లేదనే రూమర్ల వస్తున్నాయి. ప్రజల్లో బలం లేని వారిని, అవినీతి, అక్రమాల విషయాల్లో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వారిని, గెలిచే అవకాశం లేని ముందుగానే గుర్తించి వారిని పక్కన పెట్టే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికితోడు దాదాపు చాలా చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులకు పొసగడం లేదు. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరుగుతుండడంతో అది టీడీపీకి సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష
ప్రతి మూడు నెలలకోసారి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పనితీరును సీఎం ఇప్పటికే సమీక్షిస్తున్నారు. పనితీరు సరిగా లేని దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే వార్నింగ్ లు ఇచ్చారు. పనితీరు మారకుంటే ఆశలు వదులుకోవాలని చెప్పినట్లు తెలిసింది. మరికొందరికి టికెట్ రాదని కన్ ఫాం చేసినట్లు సమాచారం.
ఐపాక్ ను కాదని సొంత సర్వే..
ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి సర్వే
అయితే సీఎం జగన్ ఇప్పటికే పలువురికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి రహస్యంగా సర్వే చేయిస్తున్నారని తెలిసింది. అయితే గత ఎన్నికల్లో ఐపాక్ టీమ్ చేసిన సర్వేలు, నివేదికలు జగన్ కు కలిసొచ్చాయి. అయితే జగన్ ఐపాక్ టీమ్ ను కాదని సొంతంగా సర్వే చేయిస్తున్నారు. తనకు దగ్గరని భావిస్తున్న నేతలతో ఈ సర్వేలు చేయిస్తు్న్నట్లు తెలుస్తున్నది.
అయితే ఈ సర్వే పై ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. జగన్ ను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని సదరు నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
ఈ విషయంలో సీఎం జగన్ తన చుట్టూ ఉండి భజన చేసే వాళ్లనే నమ్ముతాడనే రూమర్ ఎప్పటి నుంచో ఉన్నది. దీంతో ప్రస్తుతం సర్వేల పేరిట భారీగా వసూళ్లకూ పాల్పడుతున్నారే విమర్శలు వస్తున్నాయి. సర్వేల విషయంలో కొందరు జగన్ ను తప్పుదారి పట్టిస్తున్నట్లు సిట్టింగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిష్పక్షపాతంగా సర్వేలు నిర్వహించే ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. సొంత పార్టీ నేతలకు సర్వే ప్రాజెక్టులు ఇవ్వడం జగన్ కే చెల్లిందనివైసీపీ నేతలు వాపోతున్నారు. అయితే ఈ సర్వేలతో జగన్ కు, పార్టీ నేతలకు గ్యాప్ రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.






