Swacha Challapally : స్వచ్ఛత, పరిశుభ్రత కోసం దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి సేవా కార్యక్రమం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచా యతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుడితి రాజశే ఖర్ అన్నారు. చర్లపల్లి తరిగోపుల ప్రాంగణంలోని డం పింగ్ యార్డ్ ఆవరణలో సోమవారం సాయం త్రం ఘన, ద్రవ్య వనరుల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రకృ తిని కాపాడుకోవాల్సిన బాధ్యత భూమిపై జీవిస్తు న్న ప్రతి ఒక్కరికీ ఉందని స్వచ్ఛ చల్లపల్లి సారథు లు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతిని కృషి ని అభినందించారు. 60 మంది కార్యకర్తలతో గత దశాబ్ద కాలంగా ప్రతిరోజు తెల్లవారుజామున స్వచ్ఛ కార్యకర్తలు గ్రామం కోసం పాటుపడటం ఎంతో గొప్పవిషయమని వారన్నారు. చల్లపల్లిలో వేలాది మొక్కలను నాటి పెంచటం, రోడ్లపక్కన మినీ గార్డెన్లను ఏర్పాటు చేయటం, డంపింగ్ యార్డు..స్మశానవాటికను అభివృద్ధి చేసి ఉద్యాన వనాన్ని ఏర్పాటుచేసిన తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
గ్రామాన్ని స్వచ్ఛంగా, సుందరంగా ఉంచేందుకు కృషిచేస్తున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమ వెలక ట్టలేనిదన్నారు. డంపింగ్ యార్డ్ లేని గ్రామం గా చల్లపల్లి దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆంధ్రప్ర దే శ్లో చల్లపల్లి గ్రామం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అంబికాపూర్ మాదిరిగా రూపొందిం చాలని ఇందుకు తనవంతు సహకారం తప్పుగా అందిస్తానని అన్నారు.
తొలుత స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డి ఆర్ కే ప్రసాద్, పద్మావతి దంపతులు, చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకు మారి, కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావుల ఆధ్వ ర్యంలో ప్రముఖ పర్యావరణవేత్త రాష్ట్ర సలహాదా రు వేలేరు శ్రీనివాసన్ పర్యవేక్షణలో తయారుచే సిన డ్రై వ్యర్ధాల ద్వారా 60 రోజుల్లో కంపోస్టుని తయారు చేసే విధానాన్ని స్వచ్ఛ ఆంధ్ర మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభిం చుగా, వ్యర్ధాల సేకరణ రిక్షాను కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు ప్రారంభించారు. వ్యర్ధాల కటింగ్ యంత్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, డి పి ఓ నాగేశ్వర నాయక్ ప్రారంభించారు.
స్వచ్ఛ ఆంధ్ర మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, చల్లపల్లిలో నేటివరకు నిర్వహించిన డంపింగ్ యార్డును సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి చేతుల మీదుగా మూసివేశారు. గత పదేళ్లుగా నిర్విరామంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్ పద్మావతి దంపతులను, చల్లపల్లి పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాదవేంద్రరావులను అభినందించారు..
అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. పర్యావరణవేత్త వేలూరు శ్రీనివాసన్ పర్యవేక్షణలో చల్లపల్లి పరిశుభ్రత కలిగిన గ్రామంగా రూపొందుతుందన్నారు. ఇప్పటివరకు సభలో సమావేశాలు పెద్దపెద్ద కూడలిలో, బిల్డింగులలో ఏర్పాటు చేసేవారిని కానీ చల్లపల్లిలో స్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ పక్కన ఏర్పాటు చేయడమంటే ఇక్కడ పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చల్లపల్లి గ్రామం డంపింగ్ యార్డ్ లేని గ్రామంగా దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆశ భావం వ్యక్తం చేశారు.
తర్వాత కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రజలకు వ్యర్థాల మేనేజ్మెంట్ విషయాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించడంలో వాలంటీర్లు కృషి చేయాలన్నారు. ఒకటికి రెండుసార్లు చెప్పటం వల్ల క్రమంగా మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు ప్రాంతాలు వారీగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలను పాల్గొనేలా చేసినప్పుడే స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని అన్నారు. ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రోడ్లపక్కన ఉండే ముళ్ళపొదలు నరకడం, చెత్త కాగితాలు ఏరడం, మొక్కలు నాటడం, డ్రైనేజి బాగుచేయడం ఇలా అనేక కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం ఎందరికో ప్రేరణ అని అన్నారు. చల్లపల్లి స్వచ్ఛ సైనికులులో రిటర్మెంట్ ఉద్యోగులు , వైద్యులు, మెకానిక్లు, వివిధ చేతి వృత్తులు చేసుకునే సుమారు 100 మంది స్వచ్చ కార్యకర్తలు అంకితభావంతో పని చేయడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.
ఈ సభలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, అందరు సహకార ఉన్నప్పుడే డంపింగ్ యార్డ్ లేని చల్లపల్లి మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. చెత్త, వ్యర్ధాలు లేని చల్లపల్లి సుందరంగా రుపొందుతు న్నందుకు సంతోషంగా ఉందని స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్, పద్మావ తి దంపతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.