Dimple Hayathi :
డింపుల్ హయాతి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. గద్దలకొండ గణేష్ లో ఐటమ్ సాంగ్ చేసిన ఆమె తరువాత హీరోయిన్ గా మారి వరుస సినిమాలు చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో కూడా ఓ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. రామబాణం సినిమాలో కూడా నటించింది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. ఖిలాడీ సినిమాలో రవితేజ సరసన నటించి మెప్పించింది.
హయాతి కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతుంది. ఇందులో భాగంగా పూజలు చేయిస్తూ ఉంటుంది. విజయవాడకు చెందిన ఈ భామ గల్ఫ్ అనే సినిమాతో రంగప్రవేశం చేసింది. తరువాత ప్రభుదేవా, తమన్నా నటించిన అభినేత్రి 2లో కీలక పాత్ర పోషించింది. ఆమె అందంపై కూడా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. తన పనితీరును నమ్ముకుంది.
ఖిలాడీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఐటమ్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయింది. ఐటమ్ సాంగులతో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. రామబాణం ప్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. మళ్లీ అవకాశాల కోసం చూస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఐటమ్ సాంగ్ కు పిలుపు రావడంతో మళ్లీ పుంజుకుంటుందని చెబుతున్నారు.
ఇటీవల జ్యోతిష్యంలో పాపులర్ అయిన వేణుస్వామితో అందరు హీరోయిన్లు జాతకం చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలో హయాతి కూడా చేరింది. ఆమె ఇంట్లో వేణు స్వామి యాగం చేశారు. దీంతో ఇది నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. హయాతి జాతకంలో ఏదో దోషం ఉండటం వల్లే ఆయన పూజలు చేశారనే వార్తలు వస్తున్నాయి. దీంతో హయాతి భవితవ్యం మారుతుందో లేదో చూడాల్సిందే.