
Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి స్పందించారు. ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులతో పాటు, సినీ ప్రియులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలానా అమ్మాయిని చేసుకోబోతున్నారంటూ, ఫలానా హీరోయిన్ తో ఏడడుగులు వేయనున్నారంటూ ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రభాస్ కు జ్యోతిష్యులు చెప్పడం నెట్టింట వైరలైంది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (కృష్ణంరాజు సతీమణి) స్పందించారు.
‘‘బాహుబలి తర్వాత ప్రభాస్ కు సినిమాల్లో విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు కల్కితో సక్సెస్ అందుకున్నారు. అలాగే, ఆయన పెళ్లి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రభాస్ చాలా గొప్ప వ్యక్తి. ఆయకు పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. ఆ సమయం రాగానే వివాహం జరిగి తీరుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.