
Heart attack :ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణంగా మారిపోయింది. మన ఆహార అలవాట్ల ప్రభావంతో చిన్న వయసులోనే గుండెపోటు సమస్య వస్తోంది. పూర్వ కాలంలో ముసలి తనంలో వచ్చే వ్యాధి ఇప్పుడు యుక్త వయసులోనూ వస్తోంది. దీనికి కారణం మనం మేల్కోకపోవడమే. గుండెపోటు లక్షణాలు మనకు ముందే తెలుస్తాయి. దీంతో జాగ్రత్తలు పాటించి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. అందుకే ప్రాణాలు పోతున్నాయి.
గుండెపోటు ఎందుకు వస్తుంది? ఏ తప్పులు చేస్తున్నాం? అని ఆలోచిస్తే శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపోటు వస్తోంది. కనీసం వాకింగ్ కూడా చేయడం లేదు. బద్ధకంతో ఉంటున్నారు. ఫలితంగా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక జీవన శైలి మరోకారణం. ఇప్పుడు ఎవరు కూడా కష్టం చేయడం లేదు. అందరు కంప్యూటర్ల ముందు కూర్చుని వేళ్లు కదపడమే. దీంతో శరీర అవయవాలకు పని లేకుండా పోతోంది. ఫలితంగా గుండెకు భారం ఏర్పడుతోంది.
Heart Attack రావడానికి ముందు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం అలసటకు గురికావడం, దవడ, మెడ, జీర్ణ వ్యవస్థలో నొప్పి వంటి లక్షణాలు తారసపడతాయి. కుడి, ఎడమ చేతుల్లో నొప్పి , కంగారుగా ఉండటం వంటివి మనకు కనిపిస్తాయి. మధుమేహం ఉన్న వారికి కూడా గుండె పోటు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలా గుండెజబ్బును ముందే గుర్తించి మనం చికిత్స తీసుకుంటే సరి.
డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం పడుకునే సమయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా పడుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ టెన్షన్ తో ఉంటే మన శరీర అవయవాలు సరిగా పనిచేయక గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువ అవుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండటమే అన్నిటికి పరిష్కారం.






