Tadepalligudem Constituency Review :
వైసీపీ : కొట్టు సత్యనారాయణ (ప్రస్తుత ఎమ్మెల్యే)
జనసేన : బొలిశెట్టి శ్రీనివాస్ రావు
ఇక రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు బరిలోకి దిగాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని కొట్టు సత్యనారాయణ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గానిదే హవా కొనసాగుతుంది. ఇక్కడ కొట్టు సత్యనారాయణ, ఈలి నాని ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాడేపల్లి గూడెం, పెట్టంపాడు మండలాలుగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల 10వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపు సామాజిక వర్గం కీలకం కాగా, ఆ తర్వాత ఎస్సీ, బీసీ సామాజికవర్గాలు ఉన్నాయి.
ప్రధానంగా మూడు పార్టీలు కాపు అభ్యర్థులను బరిలో దించుతాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో బరిలో ఎవరుంటారో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన బలంగానే ఉన్నాయి. అయితే ఈసారి టీడీపీ నుంచి ఈలినాని, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ రావు పోటీకి సై ఉంటున్నారు. అయితే ఇద్దరు కూడా వైసీపీ అభ్యర్థిపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. అయితే కొట్టుపై వస్తున్న ఆరోపణలను తిప్పకొట్టడంలో వైసీపీ వెనుకబడింది. కొట్టు సత్యనారాయణ కొడుకే నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్నట్లు చెబుతుంటారు. ఇక ఈసారి పొత్తు ఖరారైతే ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశముంటుందని కూడా టాక్ ఉన్నది. మరి అధినేతల నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇక టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో బరిలో ఉండే అభ్యర్థి గెలుపు విజయం నల్లేరు మీద నడకే కానుందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇక్కడ రెండు పార్టీలకు బలం ఉంది. 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు సమన్వయంగా వెళ్తే ఇక తాడేపల్లి గూడెం వైసీపీకి ఎదురుగాలి తప్పకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇప్పటికే కాపు సామాజికవర్గం కూడా తమ వర్గానికి చెందిన నేత పార్టీకే మద్దతునిస్తామని ప్రకటించినట్లుగా టాక్ వినిపిస్తున్నది. 60వేల ఓట్లు ఉన్న కాపు సామాజికవర్గం ఓట్లు ఎవరివైపు వెళ్తాయో, ఆ అభ్యర్థి విజయం తప్పదనే అభిప్రాయం వినిపిస్తున్నది. దీంతో అందరి చూపు జనసేన వైపు మళ్లింది. మరి పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
ReplyForward
|