36.6 C
India
Friday, April 25, 2025
More

    Takkar Trailer Review : టక్కర్ ట్రైలర్ రివ్యూ!

    Date:

    Takkar Trailer Review
    Takkar Trailer Review

    Takkar Trailer Review : టాలెంటెడ్ హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు.. ఈయన తెలుగు సినిమాల్లో ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.. అయితే ఆ తర్వాత ఈయన తెలుగులో సినిమాలు మానేసాడు.. తమిళ్ లో చేస్తూ డబ్బింగ్ సినిమాల ద్వారానే పలకరిస్తూ వస్తున్నాడు.. ఈ మధ్య డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు..

    ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ నటించిన సినిమా ”టక్కర్”.. సిద్ధార్థ్ హీరోగా దివ్యాంశ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదల అవుతున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది..

    కార్తీక్ జీ క్రిష్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ టక్కర్ సినిమా ట్రైలర్ తాజాగా సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసారు.. మరి ఈ ట్రైలర్ టాక్ ఎలా ఉందంటే.. ఊహించని ట్విస్టులు, అనేక పరిస్థితులు చోటు చేసుకోవడం, మలుపులతో కథ సాగుతుంది.. డబ్బు సంపాదించాలి.. కోటీశ్వరుడు కావాలనుకునే యువకుడు ఆ సంపాదన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు.. ఆ యువకుడి టార్గెట్ సంపన్న యువతికి చేరువ కావడం అనేది ట్రైలర్ తో స్పష్టం అవుతుంది.

    సంపన్న కుటుంబానికి చెందిన యువతితో సిద్ధార్థ్ ”నీకు ఇడ్లీలు తినపించడానికి.. నేను కిడ్నీలు అమ్ముకోవాలి” అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక యాక్షన్ సన్నివేశాలు, ఈ జంట మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టు కున్నాయి.. సిద్ధార్థ్, దివ్యాంశ మధ్య లిప్ లాక్ కూడా ఉంది.. దీంతో ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగా పండినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈసారి సిద్ధార్థ్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు. జూన్ 9 వరకు ఆగితే అసలు కథ బయట పడుతుంది.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tucker movie : టక్కర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. ఇప్పుడైనా సిద్ధార్థ్ కు హిట్ దక్కిందా?

        Tucker movie review and rating : టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన...