young actress : గతేడాది తెలుగులో విడుదలైన డబ్బింగ్ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. రెండు కూడా పాజిటివ్ టాక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రుక్మిణీ వసంత్ తన సహజ సౌందర్యాన్ని, ఆకట్టుకునే నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ, ప్రేమ దక్కించుకుంది. ఆమె లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ చూసి చాలా మంది ప్రేక్షకులు తెలుగు సినిమాల్లోకి రావాలని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఓ టాప్ టైర్ హీరో, ఓ భారీ ప్రాజెక్ట్ తో ఆమె తెలుగు సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. అయితే విధి ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం నిఖిల్ సరసన ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిన ఆమె అది దాదాపు ఆగిపోయింది. కానీ ఆమె దురదృష్టం కారణంగా దాన్ని పునరుద్ధరించి ఈ వారం విడుదల చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో లైఫ్ టైమ్ కలెక్షన్స్ కోటిలోపే వచ్చాయి.
తెలుగు ఇండస్ట్రీలో రుక్మిణి కెరీర్ కు ఇది పెద్ద దెబ్బగా మారింది. ఆమె డెబ్యూ సినిమా ఎలాంటి బ్యాంగ్ లేకుండా వచ్చి ఫస్ట్ వీకెండ్ తర్వాత ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది. గత వారం కన్నడలో విడుదలైన బగీరాలో ఆమె పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాలు తను తెలుగులో ఎంట్రీ తర్వాత వస్తే బాగుండేదని బాగుండేదని రుక్మిణి భావించి ఉంటుంది.