
Renu Desai : నటి రేణూ దేశాయ్ తన తాజా పాడ్‌కాస్ట్‌లో వ్యక్తిగత జీవితాన్ని పంచుకున్న సమయంలో, ముఖ్యంగా రెండో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ – “ఒక 44 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నదే ఎందుకు సమాజానికి ముఖ్యమైన విషయంగా మారుతుంది? నేను మహిళల హక్కులు, వాతావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి వంటి అనేక సమాజపరమైన అంశాలపై మాట్లాడాను. కానీ, వాటన్నిటినీ పక్కనపెట్టి నా వ్యక్తిగత జీవితంపైనే దృష్టి సారించడం బాధాకరం,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.