
Tamannaa Bhatia :
తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు వస్తాయి.. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఈ మిల్కీ బ్యూటీ మన తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకర్షించింది. తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇక రెండు దశాబ్దాలు అవుతున్న ఈ అమ్మడి అందాలు పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు..
తమన్నా పాలమీగడ లాంటి అందాలతో ఇప్పటికి యూత్ ను కట్టిపడేస్తుంది.. ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక తమన్నా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. వరుసగా తన లేటెస్ట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది.
తాజాగా ఈ భామ టైట్ డ్రెస్ లో అందాలన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈ అమ్మడి గ్లామరస్ ట్రీట్ కు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. మెస్మరైజ్ చేస్తున్న లేటెస్ట్ పిక్స్ మీకోసం.. ఇక 18 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 75కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్కీ బ్యూటీ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లను చేస్తుంది. ఇటీవలే తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ చేయగా ఇది ప్లాప్ అయ్యింది. అదే సమయంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తమన్నా క్రేజ్ మరింత పెంచేసింది. ఇలా ఒకటి పోయిన మరొకటి హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
https://www.instagram.com/p/CxQYg83N9_K/?igshid=NjZiM2M3MzIxNA==