
NBK 108 : టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడిక కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పై అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే క్రేజ్ పెరిగింది. కాగా బాలకృష్ణకు ఇది 108వ చిత్రం. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఓ ఐటెం సాంగ్ విషయంలో తమన్నాను దర్శకుడు వచ్చిన అనిల్ సంప్రదించినట్లు వస్తున్న రూమర్లను మిల్కీ బ్యూ్టీ ఖండించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో తమన్నా హీరోయినగా చేసిన విషయం తెలిసిందే. అయితే “సరిలేరు నీకెవ్వరు”లో చిత్రంలోని స్పెషల్ సాంగ్ ను తమన్నా చేసింది. ఈ పాటకు సంబంధించిన పేమెంట్ విషయంలో తమన్నా అనిల్ తో గొడవ పడినట్లు వచ్చిన రూమర్లపై మండిపడ్డారు. అది నిజం కాదని స్పష్ట చేశారు. “నేను @ అనిల్ రావిపూడి సార్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందిస్తాను. ఆయనపై మరియు నందమూరి బాలకృష్ణ సార్‌పై నాకు చాలా గౌరవం ఉంది. నా గురించి, వారి కొత్త చిత్రంలోని ఓ పాట గురించి ఈ నిరాధారమైన వార్తా కథనాలను రావడం బాధగా ఉంది. వార్తలు రాసే ముందు నిజాలు తెలుసుకోండి‘ మిల్కీ బ్యూటీ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలో బిజీగా ఉన్నారు. చిరంజీవి భోలా శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్, ‘అరణ్మనై 4’, ‘బాంద్రా’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మితో’ బోలే చుడియాన్లతో వరుస సినిమాలు చేస్తున్నది. అలాగే వెబ్ షోలు ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ , డిస్నీ+ హాట్‌స్టార్‌తో టైటిల్ లేని డ్రామా సిరీస్‌లో కూడా నటిస్తున్నది.