TANA Srinivasa Kalyanam : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ జాతీయ సదస్సు 2023 జూలై 7, 8, 9 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఆసక్తికర కార్యక్రమాలను ప్లాన్ చేయగా, ఈ ఈవెంట్‌కి భక్తిరసాన్ని కూడా పంచాలని తానా నిర్ణయించింది.
తానా సదస్సు చివరి రోజైన జూలై 9న శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. TTD శ్రీనివాస కళ్యాణం మహోత్సవం కార్యక్రమం జూలై 09, 2023న తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చే అర్చకుల సమక్షంలో జరగనుంది. శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో పాల్గొనాలనుకునే వారు ఇక్కడ ఉన్న లింక్‌ను క్లిక్ చేసి నమోదు చేసుకోవాలి. https://tanaconference.org/tana-ttd-srinivasa-kalyanam-details.html
తానా సమావేశం 2023 జూలై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడుతుంది. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు , కో-ఆర్డినేటర్ రవి పొట్లూరి ప్రతి ఒక్కరినీ తానా నేషనల్ కాన్ఫరెన్స్‌లో భాగస్వామ్యమని స్వాగతిస్తున్నారు. కెఎస్ చిత్ర, సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్, డాక్టర్ కమలేష్ పటేల్, చంద్రబోస్, కనకమేడల రవీంద్ర వంటి ప్రముఖులు నేషనల్ కాన్ఫరెన్స్‌లో భాగమవుతారు. నందమూరి బాలకృష్ణ, ఇళయరాజా, మురళీమోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.