TANA Election : ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారింది తానా కార్యవర్గం పరిస్థితి. సభ్యుల్లో సమన్వయం కొరవడింది. దీంతో విధుల నిర్వహణలో అలసత్వం పెరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు మినహా సభ్యుల్లో అవగాహన కనిపించడం లేదు. ఫలితంగా సభ్యుల మధ్య సహకారం ఉండటం లేదు. 2023 ఏప్రిల్ 30 నాటికి ఉన్న తానా కార్యవర్గం, బోర్డు, ఫౌండేషన్లు ప్రస్తుతం కొనసాగాలని చూస్తున్నా కుదరడం లేదు. 90 రోజుల్లో ఎన్నికలు జరిపి తదుపరి కార్యవర్గ సభ్యులను నియమించుకోవాల్సిందిగా మేరీ ల్యాండ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
తానాలో డీసీ, డెట్రాయిట్-న్యూయార్క్, అట్లాంటాల నుంచి మూడు గ్రూపులున్నాయి. ఇందులో ప్రజాప్రతినిధులను పెద్దమనుషుల అంగీకారం ఆధారంగా పదవులు దక్కించుకున్నారు. కానీ ఇలా చేయడం చెల్లదని, బోర్డు తన నైతిక విధులను నిర్వహించడం లేదని, కార్యవర్గ సభ్యుల్లో సహకారం కరువైందని సభ్యులు కోర్టును ఆశ్రయించారు.
పెద్దమనుషుల అంగీకారం ప్రకారం ఫౌండేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులు మూడు గ్రూపులకు చెందిన ఒక్కొక్కరిని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ డెట్రాయిట్-న్యూయార్క్ కు చెందిన గ్రూపుకు మిగతా రెండు గ్రూపులను పట్టించుకోలేదు. దీంతో ఫౌండేషన్ లోని ఈ ముగ్గురు తానా రాజ్యాంగం ప్రకారం బోర్డులో సభ్యత్వానికి అర్హులవుతారు. డెట్రాయిట్-న్యూయార్క్ గ్రూపునకు చెందిన వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మిగతా రెండు గ్రూపులకు తానా బోర్డులో న్యాయం జరుగుతుంది.
నూతన కార్యవర్గసభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికి సంస్థ అధ్యక్షుడు, కార్యదర్శికి తానా వెబ్ సైట్, ఈ మెయిల్ లకు సంబంధించిన సమాచారం అందజేయడం లేదు. బోర్డులో ఎన్నోసార్లు చర్చలు జరిినా సమస్య పరిష్కారం కాలేదు. గత కార్యవర్గం ప్రస్తుత కార్యవర్గానికి బదిలీ చేయలేదు. తానా కార్యవర్గం సజావుగా విధులు నిర్వహించేలా చూడటం బోర్డు కనీస విధి.
మెజార్టీ సభ్యులు పంతానికి పోయి బాధ్యతలు విస్మరించినట్లు తెలుస్తోంది. 46 ఏళ్ల కింద స్థాపించిన తానాలో ఇప్పుడు విభేదాలు వస్తుండటంతో బోర్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతోనే 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలతో తానా ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.