Pawan Sabha : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముగిసింది. శుక్రవారం భీమవరం సభతో పవన్ మొదటి యాత్రకు ముగింపు పలికారు. అయితే అంతకముందు భీమవరం సభ జనసంద్రంలా మారింది. పెద్ద ఎత్తున జనం తరలిరాగా, పవన్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ కి ఇవ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు. దీనికి జనమంతా చెయ్యెత్తి జై కొట్టారు. అయితే ఈసారి పవన్ సభకు ప్రత్యేకంగా తారక్, ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పవన్ ఈసారి తన యాత్రలు పలువురు హీరోల గురించి మాట్లాడారు. తనకు హీరోలందరూ ఇష్టమేనని చెప్పారు. హీరోలందరూ కలిస్తేనే సినీ పరిశ్రమ బతుకుతున్నదని అందరినీ కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. హీరో ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్, రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అని, తారక్, రాంచరణ్ గ్లోబల్ హీరోలని కొనియాడారు. దీంతో అందరినీ పవన్ వ్యాఖ్యలు అలరించాయి. అయితే రాజకీయంగా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.
దీంతో శుక్రవారం భీమవరం సభకు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పాటు ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. హీరో ప్రభాస్ సొంత నియోజకవర్గం నర్సాపూర్ లో ఇటీవల పవన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. అయితే అందరినీ ఉద్దేశించి హీరోలుగా తామంతా సమానమేనని, ఎవరినీ అభిమానించినా, రాజకీయంగా తనకే ఓటు వేయాలని కోరారు. రాజకీయంగా సపోర్ట్ చేయాలన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీనికి సమ్మతించారు. ఈ నేపథ్యంలో బీమవరం సభకు ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. అయితే ఇక పవన్ వైపు అభిమానులంతా చేరిపోయినట్లే. అయితే తారక్ ఫ్యాన్స్ కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత దూరంగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. దీంతో జనసేన తారక్ అభిమానులను ఆకర్షించే పనిలో పడింది.
ReplyForward
|