
TDP Believes : ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉంది అధికార విపక్షాలన్నీ తమ ఆస్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదేమైనా ఈసారి గెలవాలని వరాలు, హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.. పథకాలు,వలంటీర్ల ను నమ్ముకొని వైసీపీ ముందుకెళ్తున్నాయి.. మరోవైపు వైసీపీ, టీడీపీ వ్యూహకర్తలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే టీడీపీ మాత్రం ఓ మూడింటిని పూర్తి స్థాయిలో నమ్ముకుంది.
ప్రభుత్వ వ్యతిరేకత..
అయితే అధికారి టిడిపి ప్రభుత్వం మీద వ్యతిరేకతను బలంగా నమ్ముకుంది. వైసీపీ నాయకుల ఆగడాలు దోపిడీ రాజకీయాలు ప్రభుత్వం పై వ్యతిరేకతను చూపుతున్నాయి నేపథ్యంలో ఇది తమకు కలిసి వస్తుందని టిడిపి భావిస్తున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓవర్గాన్ని టార్గెట్గా చేసుకొని రాజకీయం చేస్తున్నదనే అపవాదు మూటగట్టుకుంది ఇది కూడా తమకు లాభిస్తుందని టీడీపీ అంచనా వేసుకుంటున్నది
టీడీపీ నేతలపై కేసులు..
మరోవైపు టిడిపి నేతలపై పెడుతున్న కేసులు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నది. కేసులు పెడితే సానుభూతితో పాటు శ్రేణుల్లో ఈసారి ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కష్టపడి పనిచేస్తారని భావిస్తున్నది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. కొందరిని జైలుకు పంపారు.
పొత్తుల అంశం..
ఇప్పటికే జనసేనతో టిడిపి పొత్తు దాదాపు ఖరారైనట్లే. ఇక బిజెపి వైపు కూడా చంద్రబాబు చూస్తున్నారు. బిజెపి కలిసి వస్తే కేంద్రం నుంచి తనకు మద్దతు ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు వామపక్షాలు కూడా చంద్రబాబు కు జై కొట్టేందుకు చూస్తున్నాయి. ఇక ఈ పొత్తుల అంశం టిడిపికి ఎంతో లాభం చేకూరుస్తుంది. అనుకున్నట్లు పొత్తు ఖరారైతే ఇక టీడీపీకి తిరుగు లేదని అంతా అనుకుంటున్నారు.