TDP Chandra babu : సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం సినిమా తీసినా అందులో తీవ్రమైన కాంట్రవర్సీ ఉంటుంది. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు అందరికీ తెలిసిందే. గతంలో ‘రక్త చరిత్ర’ సినిమా తీసిన సమయంలో పార్ట్ 1లో ఒకరిని హీరోగా చూపిస్తే.. పార్ట్ 2 మరొకరిని హీరోగా చూపించాడు. ఇందులో ఎవరు హీరోనో, ఎవరు విలనో తెలవకపోవడంతో ఏపీ ప్రజలు (అక్కడి కథ ఆధారంగా వచ్చిన సినిమా కాబట్టి) కన్ఫ్యూజన్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా తీశాడు. ఈ చిత్రం రిలీజ్ సమయంలో విపరీతమైన గొడవలు జరిగాయి. వేటికీ జనకకుండా రిలీజ్ చేసిన ఆయన చంద్రబాబును ఒక ఆట ఆడుకున్నాడు.
ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ‘వ్యూహం’ సినిమా తీస్తున్నాడు వర్మ. దీనికి సంబంధించిన రెండు టీజర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీ కాప్టర్ లో వచ్చినట్లుగా చూపిస్తూ తర్వాత మరణం, జగన్ కాంగ్రెస్ పెద్దలను కలవడం లాంటి వాటితో సహా ఆయన సీఎం అయ్యే వరకు చిత్రాన్ని తీసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు వర్మ. మొదటి టీజర్ లోనే చంద్రబాబు మొహంలో పూర్తి క్రూరత్వాన్ని పులిమి రిలీజ్ చేశాడు. ఇక్కడి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎంటర్ చేయని వర్మ తర్వాత ట్విటర్ లో ఒక పిక్ రిలీజ్ చేశాడు. అందులో పవన్ కళ్యాణ్, చిరంజీవీ, అల్లు అరవింద్ (సినిమాలో పాత్రలు) కనిపించారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడని హింట్ ఇచ్చాడని తెలుస్తోంది.
తనకు వ్యతిరేకంగా తీసిన ‘వ్యూహం’ సినిమాపై కూడా చంద్రబాబు తన అక్కున చేర్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మహానాడు వేధికగా ఆయనవ్యూహం గురించి మాట్లాడారు. ‘ఇప్పటి వరకు నాలోని మంచి తనాన్ని చూశారు గానీ భవిష్యత్ తో నాలోని వ్యూహాలను ‘వ్యూహం’ సినిమాలో చూడబోతారు. వ్యూహం టీజర్ రేపు పొద్దున 11 గంటలకు రిలీజ్ అవ్వబోతోందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా’ అని మహానాడు వేదికగా చెప్పాడు చంద్రబాబు.
చంద్రబాబు మాట్లాడిన మాటలను వర్మ తన యూ ట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు. అయితే ఇది ఎడిటెడ్ చేసిందా..? లేక చంద్రబాబే ఈ మాటలు మాట్లాడాడా.? అన్న సందేహాలు ఇప్పటికీ చాలా మందికి కలుగుతున్నాయి. అయితే ఇవి బాబు అన్న మాటలు కాదని స్పష్టమవుతుంది. వర్మ క్రియేటివిటీగా దీన్ని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ బాగానే సూట్ అయినా.. సెకండ్ ఆఫ్ మాత్రం ఏ మాత్రం సింక్ కలేదు. నెటిజన్లు మాత్రం వర్మలోని క్రియేటివిటీకీ లైక్స్ చెప్తున్నారు.