
TDP female leader : వైఎస్ఆర్ కడప జిల్లా సమీక్షా సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులందరూ హాజరయ్యారు. వేదికపై కూర్చున్నారు. అయితే ఇందులో గలాటా చేస్తున్న వైసీపీ నేతలకు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఇచ్చిపడేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ జిల్లా సమీక్ష సమావేశానికి రావాలని తెలియదా? కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డికి హాజరు కావాలని తెలియదా? అంటూ మండిపడ్డారు.
ఏకంగా మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ లు ఇడుపుల పాయలోనే ఉండి మీటింగ్ కు హాజరు కాని వైనాన్ని ఈ టీడీపీ మహిళా ప్రజాప్రతినిధి కడిగిపారేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.