
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, నారా లోకేశ్‌కు పూర్తి అధికారాలు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం, త్వరలోనే ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ పదవి ద్వారా లోకేశ్ పార్టీకి నేరుగా దిశానిర్దేశం చేసే స్థాయికి చేరనున్నాడు.
లోకేశ్ ‘యువగళం పాదయాత్ర’ ద్వారా పార్టీ బలాన్ని గ్రామస్థాయిలో పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మంత్రిగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక సమయం కేటాయిస్తూ, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉండడం ద్వారా యువతలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు పార్టీలో ఆయనకు అప్పగించనున్న అధికారాలు, టీడీపీ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారనున్నాయి. నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని ముందుండి నడిపించగల నాయకుడిగా లోకేశ్‌ను నిర్మించేందుకు ఈ పాదవి కీలకంగా మారనుంది.
నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్…!
పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం
ఈ మేరకు తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అందుకోనున్న నారా లోకేశ్
పార్టీ బలాన్ని మరింత పెంచిన లోకేశ్ ‘యువగళం పాదయాత్ర’
మంత్రిగా… pic.twitter.com/PV9daK7FKv
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2025


