
TDP Jana Sena pair : కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం ఏపీ రాజకీయాలపై కూడా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగిన జనసేనతో పాటు పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. అయితే అక్కడ బీజేపీ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో బీజేపీ లేకుండా కూటమి ఏర్పాటు చేసుకోవాలని ఆయా పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఆ పార్టీని వీడేలా కనిపించడం లేదు.
భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్న జనసేన పార్టీ విపక్షాలను కూడా కలుపుకొని పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ వైసీపీకి దూరంగా దూకుడుగా పోరాటం చేసేందుకు ముందుకు రాని బీజేపీ నేతలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ చంద్రబాబు నాయుడును కూడా కలుపుకోవాలన్న పవన్ సూచనను గతంలో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బీజేపీ అధినాయకులు దీనిపై పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సై అన్నా.. నై అన్నా.. టీడీపీ-జనసేన కలిసే పోటీకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఆయన పార్టీ నాయకుల నుంచి వినికిడి. బీజేపీ ఏం చెప్పినా ఇక టీడీపీతో జనసేన కలిసే నడువడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ అధిష్టానం టీడీపీని కూడా కలుపుకోవాలన్న పవన్ సూచనపై మళ్లీ పునరాలోచిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తుండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-సీపీఐ కూటమి కలిపి పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత రామకృష్ణ ఈ రోజు (మే 18)న ప్రకటించారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో తాము కలిసి పనిచేస్తున్నామని సీపీఐ రామకృష్ణ తెలిపారు. టీడీపీ-జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే బీజేపీతో కలవద్దని చెప్తామని సీపీఐ రామకృష్ణ పవన్ కళ్యాణ్ ను కోరతామని చెప్తున్నారు. వైసీపీపై పోరాటంలో ముందుకు రాని బీజేపీని వదిలి తమతో కలవాలని పవన్ కళ్యాన్ ను రామకృష్ణ కోరుతున్నారు.