TDP-Janasena-BJP : బిజెపి, టిడిపి ,జనసేన పార్టీల మధ్య పొత్తు కుది రింది. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చే యాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటు పై త్వ రలో సమావేశం అవుతామని టిడిపి నేత కనక మేడల వెల్లడించారు.
పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. బిజెపి జనసేన పోటీ చేయగా మిగిలిన సీట్లలో టిడిపి పరిధిలో నిలుస్తుందని వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామని కనుక మేడల తెలియజేశారు.
గత కొద్ది రోజులుగా బిజెపి పార్టీ పొత్తు పై క్లారిటీ ఇవ్వలేదు. జనసేన, టిడిపి అధినేతలు ఢిల్లీ వెళ్లి బిజెపి అధినేతలతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. అయితే బిజెపి ఎప్పుడు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు.
నేడు పొత్తు అంశంపై వారు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి, జనసేన తో కలిసి పొత్తులో బిజెపి కూడా పోటీ చేస్తుందని వెల్లడించారు.