
CM Jagan Chappals : సీఎం జగన్‌పై, ఆయన పరిపాలనపై ప్రతిపక్ష టీడీపీ అన్ని వైపుల నుంచి దాడికి తెరలేపింది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో టీడీపీ ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ దాడిని మరింత ఉధృతం చేసింది.
సీఎం జగన్‌ను, ఆయన టీమ్‌ను కార్నర్ చేయడంలో టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా సీఎం జగన్ చప్పుళ్ల ఖర్చు ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎల్‌విఎంహెచ్ యాజమాన్యంలోని ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన బెర్లూటీ చెప్పులుగా సీఎం జగన్ చప్పల్స్ బ్రాండ్‌ను నెటిజన్లు గుర్తించారు. సీఎం జగన్ చెప్పుల ధర 6153 సౌదీ రియాల్స్ అంటే మన కరెన్సీలో రూ. 1.35 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది.
సీఎం జగన్ చెప్పుల ఫోటోలు ఆన్‌లైన్‌లో మీమ్స్ , ట్రోల్స్‌తో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ప్యాకేజ్డ్ హిమాలయన్ వాటర్ బాటిల్స్ తాగుతూ చంద్రబాబుపై వైసీపీ గతంలో చేసిన ట్రోల్‌లకు కొందరు దీన్ని లింక్ చేసి ఏకి పారేస్తున్నారు..
“చంద్రబాబు రూ.60 హిమాలయన్ వాటర్ బాటిల్స్ తాగారని వైఎస్సార్సీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు. రూ. 1 జీతం తీసుకుంటున్న సీఎం జగన్ 1.35 లక్షల చెప్పులు వాడుతున్నారు’’ అని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆన్‌లైన్‌లో వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై, నేతలపై మాటల దాడికి దిగారు.
సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉన్న టీడీపీ క్యాడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ట్రోల్ చేసే ముందు వాస్తవాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఏది ధరించాలనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఎంపిక అయితే, విమర్శలు రాజకీయంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా కాదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
బాబుగారు 60/- హిమాలయా వాటర్ బాటిల్స్ వాడుతున్నారని తెగ ఏడ్చారు paytm బులుగు పందులు..
ఇటుచూడండి ఈ 1/- రూపాయ్ బలుపు జీతగాడు కాలికి వాడే చెప్పులు ఎంత ఖరీదో..1,34,800/-🤦🏻♀️🤦🏻♀️ #100DaysOfYuvaGalam pic.twitter.com/5Jg62bE7dr— kumarkaza (@kumarkaza2) May 15, 2023