అందుబాటులో ఉన్న ప్రతీ వేదికను, అవకాశాన్ని వినియోగించుకుంటూ చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలకు కూడా హాజరై అసెంబ్లీ సాక్షిగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. శాసనసభ, మండలిలో వైసీపీ సభ్యులు తమని అవమానిస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పోరాటమే అజెండాగా ముందుకు సాగుతున్నందున ఎన్ని అవమానాలనైనా భరించడానికి సిద్ధపడుతున్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులను మాట్లాడనివ్వకుండా స్పీకర్ మైకులు కట్ చేసినా తమ నిరసనలను కొనసాగించాలని, ఒకవేళ సభ నుంచి బహిష్కరిస్తే శాసనసభ ఆవరణలో నిలబడి నిరసనలు వ్యక్తం చేయాలని నారా లోకేశ్ సూచించారు. ఏదేమైనా నిరసనలు, పోరాటాలు కొనసాగించాలిన నిర్ణయించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత టీడీపీ నేతలందరూ ప్రజల మద్యకు వెళ్లి జగన్ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులపై, వైసీపీ నేతల అవినీతి భాగోతాలను ప్రజలకు వివరించాలని, జగన్ తీరును ఎండగట్టాలని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు.
AP Assembly Sessions :
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలవబోతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఈ సమావేశాలను టీడీపీ బహిష్కరిస్తుందని వైసీపపీ నేతలు భావిస్తుంటే, సమావేశాలకు తాము హాజరవుతామని టీడీఎల్పీ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ జూమ్ ద్వారా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై అసెంబ్లీ సమావేశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలనే టీడీపీ నిర్ణయం సముచితమే అయినా సభలో వీరికి అవకాశం ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికే హాజరు కాకేంట అసెంబ్లీలో ప్రశ్నించేవారే ఉండరు కనుక సీఎం జగన్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, టీడీపీ నేతలంతా అవినీతిపరులే అని అందుకే వారిని అరెస్ట్ చేస్తున్నామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం ఖాయం.గతంలో చంద్రబాబు నాయుడునే సభలో దారుణంగా అవమానించి కంటతడిపెట్టించిన విషయం తెసిందే. ఇప్పుడు జైలుకి కూడా పంపి రాక్షసానందం పొందుతున్న వైసీపీ సభ్యులు రేపు సమావేశాలకు హాజరయ్యే టీడీపీ సభ్యులను మరింత దారుణంగా అవమానించడం ఖాయం. అందుకు సిద్దపడే టీడీపీ సభ్యులు సమావేశానికి హాజరవ్వాలే నిర్ణయం తీసుకున్నారు. టిడిపి, వైసీపీల ప్రవర్తన, మాట తీరు మధ్య ఎంత తేడా ఉందో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చూపించే అవకాశం ఉంటుంది.