
TTD letters : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇవ్వనుండగా, ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పిస్తారు.