38.7 C
India
Thursday, June 1, 2023
More

    Teachers fight : విద్యార్థుల ముందే తన్నుకున్న టీచర్లు.. ఎక్కడంటే..

    Date:

    Teachers fight
    Teachers fight

    Teachers fight : ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యవస్థ. భావి పౌరులను, ఆదర్శవంతంగాతయారు చేసే మార్గదర్శకులు వారు. విద్య వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో అలాంటి విలువలు కనుమరుగవుతున్నాయని చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో సంస్కరణలు అవసరమని మరికొందరు కోరుతున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి అభాసుపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపైనే ఉందని పలువురు వాపోతున్నారు..

    అయితే ఇక్కడ ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాళ్లు తన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలిని కొట్టారు. చివరకు చెప్పులతో కూడా కొట్టుకున్నారు.బిహార్ లోని ఓ పాఠశాలలో తలెత్తిన వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. పాట్నాలోని కొరియా పంచాయతీ విద్యాలయంలో కాంతి కుమారి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలోని ఓ తరగతి గది కిటికీ విషయమై ఇద్దరు టీచర్లతో కాంతికుమారికి వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి ఆ ఇద్దరు టీచర్లు కాంతికుమారిపై దాడి చేశారు. కింద పడేసి కొట్టారు. చెప్పులతో కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మరికొందరు కాసేపటికి వారిని విడదీశారు.

    బాధ్యతగా మెలగాల్సిన టీచర్లు ఇలా విద్యార్థుల మీద బాహబాహీకి దిగడం వివాదస్పదమైంది. ప్రస్తుతం ఈ ఘటన పాట్నా జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బిహార్ తో పాటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు టీచర్లపై ట్రోల్స్ కొనసాగుతున్నాయి. మరికొందరు వారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మార్గదర్శకులుగా నిలవాల్సిన వాళ్లే ఇలా బహిరంగంగా తన్నుకోవడం సరికాదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు అంటున్నారు. మరోవైపు వారిపై చర్యలకు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Seventh class girl : ఏడో తరగతి బాలికపై ఐదుగురు విద్యార్థుల లైంగికదాడి..

    Seventh class girl : సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఒకటి...

    ఇంటర్ ఫలితాలు.. ఆ 9మంది విద్యార్థుల ఉసురు తీశాయి

     INTERMEDIAT విద్యార్థుల‌కు చాలా కీల‌క‌మైన ద‌శ‌. ఇంట‌ర్ త‌ర్వాత య‌వ్వ‌నం పూర్తై...