Team India Jersey : వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి జరగనుంది. దీని కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇప్పటికే అన్ని దేశాలు తమ జెర్సీని విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కూడా ఎలాంటి జెర్సీ వేసుకుంటుందో అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. జట్టు సభ్యులు వేసుకునే డ్రెస్ తయారులో టీమిండియా ఎలాంటి నమూనా తయారు చేస్తుందోనని చూస్తున్నారు.
తాజాగా టీమిండియా జెర్సీని విడుదల చేసింది. సింగర్ రాఫ్తార్ పాడిన తీన్ కా డ్రీమ్ పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లి, హార్థిక్ పాండ్యాలు కొత్త జెర్సీలో కనిపిస్తారు. భుజాలపై మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు ముద్రించారు. టీమ్ లోగోపై మూడు నక్షత్రాలు ఉంటాయి.
ఇప్పుడు రెండు నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. భారత జట్టు ఇదివరకే రెండు ప్రపంచ కప్ లు 1983, 2011 సంవత్సరాల్లో ప్రపంచ కప్ లు మన సొంతమయ్యాయి. జెర్సీతో పాటు పాట కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ జెర్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. జెర్సీ బాగుందని కితాబిస్తున్నారు.
ముచ్చటగా మూడోసారి టీమిండియా ప్రపంచ కప్ ను ముద్దాడాలని కసరత్తు చేస్తోంది. అభిమానుల ఆశల మేరకు ఇప్పుడు ప్రపంచ కప్ ను సొంతం చేసుకుని కల నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు ఆటగాళ్లు కూడా కసితో ఉన్నారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ లో ఈ సారి విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.