
Teenmar Mallanna : రెడ్లపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సిద్దిపేటకు చెందిన ఒక కే. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు.
కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈ నెల 21 లోపు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది..






