
Telangana accent : ఆంధ్రా ప్రాంతం నుంచి విడిపోయాక తెలంగాణ స్లాంగ్ కు డిమాండ్ పెరిగింది. ఇక్కడి భాషా, యాసను ప్రతీ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తామనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. సినిమా అనేది ఉమ్మడి ప్రపంచం అది అందరిదీ అందిరినీ అక్కున చేర్చుకునే కళామతల్లి ఇంత కాలం తెలంగాణను మాత్రం సవతి బిడ్డగానే చూసింది. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఇక్కడి బలాన్ని మరింత గట్టిగా చూపుతున్నారు దర్శక నిర్మాతలు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ఆర్ నారాయణ మూర్తి, దాసరి నారాయణ రావు తీసిన చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కరోనా, ఆఫ్టర్ కరోనా వచ్చిన మన తెలంగాణ స్లాంగ్ ఉన్న సినిమాలు అందులో విజయం సాధించిన వాటి గురించి తెలుసుకుందాం.
జాతిరత్నాలు..
2021లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో ఈ మూవీ వచ్చింది. తెలంగాణ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన ‘జాతి రత్నాలు’ టాలీవుడ్ నే ఒక కుదుపు కుదిపింది. కరోనా టైమ్ లో రావడంతో డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ చేశారు మేకర్స్. ఆఫ్టర్ కరోనా థియేటర్స్ లో కూడా దీన్ని రిలీజ్ చేశారు.
వకీల్ సాబ్..
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. 2021లో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఒక స్టార్ హీరో తెలంగాణ స్లాంగ్ యూజ్ చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇది బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.
లవ్ స్టోరీ..
దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి తారాగణంలో 2021లో వచ్చిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇదొక అందమైన ప్రేమకథగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా స్లాంగ్ మాత్రమే కాదు. కథ, మేకింగ్ కూడా పూర్తిగా తెలంగాణతో ముడిపడి ఉందే. డైరెక్ట్ శేఖర్ కమ్ముల చిత్రంలో చాలా వరకు తెలంగాణ స్లాంగ్ ను వాడుతుంటారు.
డీజే టిల్లు..
2022 సంవత్సరంలో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో సంచలనం సృష్టించాడు. ఈ క్యారెక్టర్ కు యువత ఎంతగా ఫిదా అయ్యారంటే. కరోనా తర్వాత ఈ సినిమా సృష్టించిన విజయాలు అంతా ఇంతా కావు. తెలంగాణ స్లాంగ్ వాడుతూ సిద్దు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ మంచి కామెడీ సినిమా చూడాలంటే డీజే టిల్లు పర్ ఫెక్ట్ అంటుూ నెటిజన్లు కామెంట్లు పెడుతూనే ఉంటారు.
ఆర్ఆర్ఆర్..
జక్కన డైరెక్షన్ లో వచ్చి ఆస్కార్ సాధించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. 2022లో వచ్చిన ఈ సినిమా సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచింది.
వాల్తేరు వీరయ్య ..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మాస్ మహరాజ్ రవితేజ పూర్తిగా తెలంగాణ స్లాంగ్ ను వాడుతారు. ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించిన ఆయన మంచి నటనను ప్రదర్శించాడు.
బలగం..
జబర్దస్త్ కమెడియణ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బలగం’. తెలంగాణ భాషే కాదు, పూర్తి చిత్రం బ్యాక్ డ్రాప్ కూడా తెలంగాణలో కొనసాగింది. 2023లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ మూవీ ఇప్పటికీ గ్రామాల్లో తెరలు ఏర్పాటు చేసుకొని మరీ చూస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి అత్యంత భారీ చిత్రం కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ.