
Telangana budget : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 5.2.26,982 . 5.36,504 కోట్లు అని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా పాలనను అందిస్తున్నామన్నారు.. మొత్తం రూ.3.10 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగాను, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగాను ఉంది.
ముఖ్యంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 31605 కోట్లు కేటాయించడం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. మహిళా శిశు సంక్షేమానికి రూ.2862 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1674 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.5734 కోట్లు కేటాయించడం ద్వారా ఆయా రంగాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది.అన్నింటికంటే ముఖ్యంగా విద్యాశాఖకు రూ.23,108 కోట్లు కేటాయించడం ద్వారా భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిధులతో జిల్లాలోని పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.