
Telangana Congress :
అధికార పార్టీపై పోరులో కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న బీజేపీ కూడా ఇక రణక్షేత్రంలోకి దిగింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారథ్యంలో పలు వ్యూహాలతో ముందుకెళ్తున్నది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. ఇటీవల కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీలో జోష్ మరింతగా పెరిగింది. తాజాగా సీడబ్ల్యూసీ సమావేశాన్ని కూడా హైదరాబాద్ లో నిర్వహించింది. ఇక హైదరాబాద్ లోని తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 6 ప్రధాన హామీలను ప్రజల ముందు ఉంచారు. పూర్తి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇందులో ప్రధాన 6 హామీలు ఇవే..
1. మహాలక్ష్మి పథకం : మహిళలకు ప్రతి నెల రూ. 2500 చెల్లిస్తారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు.
2 రైతు భరోసా : రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏడాది రూ. 15 వేలు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏడాది రూ. 12 వేలు. వరి పంటకు క్వింటాల్ పై బోనస్ రూ. 500
3. గృహజ్యోతి : నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు
4. ఇందిరమ్మ ఇళ్లు : ఇళ్లు లేని వారందరికీ ఇండ్లు. ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షలు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు 250 చదరపు గజాల స్థలం.
5. యువ వికాసం : తెలంగాణలోని విద్యార్థులకు రూ. 5 లక్షల విలువ చేసే విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు
6. చేయూత : అర్హలందరికీ నెలకు రూ. 4 వేల పింఛన్. రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా సదుపాయం.
ReplyForward
|