Congress :
తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇన్నేళ్లు స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఊపందుకుంది. గతంలో తెలంగాణలో పీతల పంచాయతీ పెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సఖ్యతతో వ్యవహరిస్తోంది. ఇదే విధంగా ఎన్నికల వరకు కష్టపడితే 40 నుంచి 50 సీట్లను గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తమ గెలుపుపై రేవంత్, అధిష్టానం సర్వేలు చేయించుకుంటుంది.
ఇది సాధ్యదూరమే అంటున్నారు. బీఆర్ఎస్ నెగెటివ్ ఓటు కాంగ్రెస్ వైపే మళ్లుతుందని భావిస్తున్నారు. కర్ణాటక గెలుపులో కాంగ్రెస్ జేడీఎస్ సీట్లను తన ఖాతాలో వేసుకుంది కానీ బీజేపీ ఓటు శాతాన్ని మార్చలేదు. అయితే ఇదే తరహాలో తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకును తనవైపునకు లాక్కొని గెలుపు బాటలో వెళ్లవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులు వేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ వద్ద పక్కగా గెలిచే వారి లిస్ట్ రెడీగా ఉందట. ఎలక్షన్ కోడ్ రావడంతోనే ఫస్ట్ దీన్నే ప్రకటిస్తారట ఈ నేపథ్యంలో సర్వే ఫలితాలు మారే అవకాశం లేకపోలేదని రాజకీయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు సఖ్యతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరా ఎలక్షన్ కోడ్ వచ్చాక కుమ్ములాటకు పాల్పడుతుందని వర్గ విభేదాలు మొదలవుతాయని తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సారి సెకండ్ ప్లేస్ కే కాంగ్రెస్ పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఇక్కడ బీజేపీని కూడా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే బండి అధ్యక్షుడిగా పల్లెల వరకు పార్టీని తీసుకెళ్లారు. అయినా, గెలుపు అనుమానంతో ఆ కేడర్ మొత్తం కాంగ్రెస్ వైపు మళ్లినా.. సిటీల్లో మాత్రం బీజేపీ ఈ సారి మంచి సర్ఫార్మెన్స్ చూపుతుందని కూడా వినిపిస్తోంది.