Telangana :
తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో పార్టీల్లో రాజకీయ వేడి మొదలైంది. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో అలజడి మొదలైంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉండగా వాటికంటే ముందే శాసనసభ ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇందులో చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మిగతా చోట్ల బీజేపీ ఉంది. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మూడోసారి గెలవాలని తాపత్రయ పడుతోంది. కానీ దాని ఆశలు అడియాశలే కానున్నాయని సర్వేలన్ని ఘోషిస్తున్నాయి.
ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నారు. మోడీ చరిష్మాతో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని చెబుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే ధోరణిలో ఉన్నాయి. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి.
సీ ఓటరు సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ కు ఉన్న ఏడు సీట్లలో మూడు గెలుస్తుందని అంచనా వేస్తోంది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంటుంది. ఈసారి బీఆర్ఎస్ కు భంగపాటు ఎదురు కానుంది. ఈ మేరకు సర్వేలు కోడై కూస్తుండటంతో కేసీఆర్ లో అంతర్మథనం నెలకొంటోంది. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అనే వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సూచిస్తున్నారు.
ReplyForward
|