Telangana Social Media Activists : పోశెట్టి చెక్ పెట్టాల్సిందే..! బీఆర్ఎస్ ఖతమయ్యే వరకు విశ్రమించేది లేదు..! ఈ ప్రభుత్వం విధానాలు సరైనవి కావు..! ఇలా చెప్పే జర్నలిస్టులు ప్రస్తుతం అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ ను ఓడిస్తుందంటే ఖచ్చితంగా చేతులు కలుపుతామన్నారు. ఇందుకు తగ్గట్లుగా ఆ గొంతుకలు అమ్ముడు పోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి కాంగ్రెస్ అధినాయకుడు భారీగా ఆఫర్ చేసినట్లు వార్తలు తెగ షేర్ అవుతున్నారు. వీటిని ఎవరు సృష్టించారో తెలియదు గానీ ప్రజలు మాత్రం తమ వాయిస్ వినిపించే వీరు కూడా అమ్ముడు పోయారా? అంటూ పెదవి విరుస్తున్నారు.
జర్నలిస్ట్ వృత్తికే వన్నె తెచ్చిన కొందరు ప్రభుత్వంపై పోరాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంటారు. గతంలో ఈ బాధ్యతను పత్రికలు తీసుకునేవి. కానీ ప్రతీ పార్టీకి సొంత పత్రిక ఉండడంతో వాటిని జనాలు కూడా నమ్మడం లేదు. ప్రజల వాయిస్ ఎవరు వినిపిస్తారు అనుకునే తరుణంలో తీన్మార్ మల్లన్న, తొలి వెలుగు రఘు, కాళోజీ శ్రీనివాస్, దాసరి లాంటి వారు సోషల్ మీడియా వేధికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రభుత్వంలోని లోటు పాటు పథకాలలోని మంచీ చెడులను బెరీజు వేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. అయితే వారు ఇటీవల అమ్ముడు పోయినట్లు వస్తున్న వార్తలతో ప్రజలు వారి అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ ఎలాగైనా తెలంగాణను దక్కించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఏ దారినీ వదలడం లేదు. ఇటీవల జనాలకు బగా దగ్గరైన తీన్మార్ మల్లన్న, తొలివెలుగు రఘు, కాళోజీ శ్రీనివాస్, దాసరిని తమ వైపునకు తిప్పుకోవాలని అనుకున్నాయట. ఇందులో భాగంగా ఎలక్షన్ ముగిసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలని స్వయానా రాహుల్ గాంధీ అనుచరుడు ఒక ప్యాకేజ్ ఫిక్స్ చేశారట. తీన్మార్ మల్లన్నకు రూ. 5 కోట్లు, తొలి వెలుగు రఘుకు రూ. 2 కోట్లు, కాలోళీ, దాసరికి చెరో రూ. 2 కోట్ల చొప్పున ప్యాకేజీ అప్పగించినట్లు సోషల్ మీడియాలో కథనం వెలువడింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఇది చూసిన వారి అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారట.