AP : ఏపీలో అధికార వైసీపీ శ్రేణులకు టీడీపీ నుంచి ఊహించని పరిస్థితి ఎదురవుతున్నది. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులపై దాడికి దిగిన ప్రతిసారి అవతలి వైపు నుంచి వస్తున్న కౌంటర్ చూసి బిత్తెరపోతున్నది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నది. టీడీపీ శ్రేణుల నుంచి ఇంతలా ప్రతిఘటనను గతంలో వైసీపీ శ్రేణులు చూడలేదు. ఒక్కసారిగా కట్టలు తెచ్చిన ఆగ్రహంతో టీడీపీ శ్రేణులు దాడికి దిగుతుండడంతో చేసేదేం లేక వెనుదిరిగి వెళ్లాల్సి వస్తున్నది.
అయితే ఎన్నికలకు ముందు ఇది టీడీపీలో ఈ జోష్ మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నది.ఎన్నికల్లో అధికార పార్టీ హవా ఎలాగూ ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీ లో ఈసారి మంచి జోషి కనిపిస్తున్నది. ఎక్కడా తగ్గకుండా వైసీపీ శ్రేణుల దాడులకు తిప్పికొట్టేందుకు టీడీపీ క్యాడర్ సిద్ధమవుతున్నది. పులివెందుల, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలను బట్టి ఇదే తెలుస్తున్నది.
ఇకపై వైసీపీ శ్రేణులు చేసే దాడులకు తలొగ్గేది లేదని, గట్టి సమాధానం చెప్పి తీరుతామనే ధీమా టీడీనీ శ్రేణుల్లో కనిపిస్తున్నది అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి జోష్ అవసరమని అధినేత కూడా నేరుగానే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఆగడాలను తట్టుకోవాలంటే ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ నేతలకు సమాధానం చెప్పేలా క్యాడర్ సిద్ధమవడం మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నది.
అయితే పులివెందులలో ఓ వాహనంలో వచ్చిన వ్యక్తి వైసీపీ జెండాలతో మీసం మెలేశాడు. ముందుగా ఆ కారుకు నంబరు లేదు. కేవలం వైఎస్ జే అనే పేరు మాత్రమే రాసి ఉంది. ఇది చూసి టీడీపీ కార్యకర్తలు వెంబడించడంతో వాహనంతో సహ పరారయ్యాడు. వైఎస్ జే అనే పేరున్న వాహనాన్ని తరిమికొట్టడం టీడీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏదేమైనా రానున్న 9 నెలలు ఇదే జోష్ ఉంటే టీడీపీని ఢీకొట్టడం ఇక వైసీపీకి కష్టమైన పనే. గ్రామాల్లో టీడీపీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వారిని మరింత తట్టిలేపి ఎన్నికల్లో గెలిచేందుకు తొలి అడుగు అవుతాయని అంతా భావిస్తున్నారు.