22.3 C
India
Sunday, September 13, 2026
More

    America Team : అమెరికా జట్టు కెప్టెన్ గా తెలుగమ్మాయి

    Date:

    America team
    America team

    America Team : 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్ 19 టీ-20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ టి-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగు అమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్ గా వ్యవహరించబోతోంది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో మరో ముగ్గురు తెలుగు సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు.

    పడిగ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, నషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరపున బరిలోకి దిగబోతున్నారు. ఈ జట్టుకి కెప్టెన్ గా ఎంపికైన అనిక రెడ్డి మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు కొలన్ మంజుల – అల్లుడు సురేష్ రెడ్డి దంపతుల కూతురు. సురేష్ రెడ్డి – మంజుల 12 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. మంజుల వైద్యురాలు కాగా.. సురేష్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

    శాన్వి తండ్రి రమేష్ ప్రస్తుతం సిస్కో సిస్టమ్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు. ఇక జనవరి 18 నుండి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు జరగబోయే మలేషియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎ లో భారత్, వెస్టిండీస్, శ్రీలంక మలేషియా జట్లు ఉండగా.. గ్రూప్ బి లో అమెరికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్. ఇక గ్రూప్ సి లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, సమోవా, నైజీరియా. గ్రూప్ డి లో బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SUPER SINGER: సూపర్ సింగర్ కు ఎంపికైన..అమెరికాలోని కర్నూలు అమ్మాయి

        ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న “సూపర్ సింగర్”  పాటల పోటీ కార్యక్రమానికి  అమెరికాలోని...