
NRI Sunny Reddy : వేన్ స్టేట్ యూనివర్సిటీ (Wayne State University) బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా సన్నీ రెడ్డి ఎన్నికయ్యారు. ఈయన సాధించింది ఒక ప్రముఖ ఘనతగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఆయన విజయం, మరియు విశ్వవిద్యాలయం వృద్ధికి సానుకూలమైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.. ఆయన అనుభవం, సమాజ సేవకు చేసిన కృషి, విద్యావ్యవస్థలో ప్రత్యేకమైన దృష్టికోణం సన్నిరెడ్డి ఎన్నికవ్వడంలో సహాయపడింది.

వేన్ స్టేట్ యూనివర్సిటీ అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ విద్యాసంస్థ. సన్నీ రెడ్డి ఎంతోమంది మేధావులను తోసిరాజని అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరుఫున మంచి మెజారిటీతో సన్నీరెడ్డి గెలిచారు. అలాగే ఆయన కమ్యూనిటీలో మరింత సేవలు అందించే అవకాశం లభించినట్టైంది.
జనవరి 1 , 2025 నుంచి సన్నీరెడ్డి నియామకమయ్యారు. ఆయన డిసెంబర్ 31, 2032 వరకు పదవిలో ఉంటారు. ఈయన ఎన్నిక అమెరికాలోని తెలుగువారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీకి సైతం గర్వించదగ్గ విషయం అని ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారు.






