Kedarnath : కేదార్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వారిలో కొంత మంది యాత్రికులు గుప్తకాశీకి చేరుకున్నారు. మరో ముగ్గురు యాత్రికులు కూడా మరి కాసేపట్లో గుప్త కాశీకి చేరుకుంటారని సమాచారం. ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేక పోతున్నామని శుక్రవారం పలువురు యాత్రికులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సంప్రదించారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి లోకేశ్, సీఎం కార్యాలయం దృష్టికి ఎంపీ తీసుకు వెళ్లారు. ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి లోకేశ్, సీఎం కార్యాలయ అధికారులు మాట్లాడారు. దీంతో శనివారం వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. యాత్రికులు ఎంపీకి, లోకేశ్ కు, సీఎం కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు.
Breaking News