![Human Existence](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/earth-1.webp)
Human Existence : భూమి ఎప్పుడు పుట్టింది, దాని వయస్సు ఎంత అన్న విషయాల గురించి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇలాంటి విషయాలపై శాస్త్రవేత్తలు ఏండ్ల తరబడి వరుస ప్రయోగాలు చేస్తూ విశ్వంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదిస్తున్నారు. ఈక్రమంలోనే భూమిని గురించి కూడా ఎన్నో ప్రయోగాలు చేసి భూమి వయస్సు 4.5బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ అని తెలిపారు. భూమి ఉద్భవించినప్పటి కాలంలో ఎలాంటి జీవరాశి లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ రోజుల్లో మనం చేసే ప్రతీ పనిలోనూ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇంటి పనులు మొదలుకుని, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వరకు ప్రతీది యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఈక్రమంలోనే కొంతమంది నిరాశావాద శాస్త్రవేత్తలు మానవులు ఎప్పుడు ఉనికి లేకుండా పోతారో అన్న అంచనా వేయడానికి సాంకేతికతను ఉపయోగించారు.
మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని శాస్త్రవేత్తల బృందం జనాభా, సహజ వనరులు, శక్తి వినియోగం వంటి వాటిపై బహుళ డేటా నమూనాలను పరిగణలోకి తీసుకున్నారు. దీని ద్వారా అంచనాలను గుర్తించడానికి కంప్యూటర్ మోడలింగ్ ను ఉపయోగించారు. క్లబ్ ఆఫ్ రోమ్ ప్రచురించిన అధ్యయనం, రాబోయే ‘పరిణామానికి పరిమితులు’ను తెలుపుతుంది.
ఈ పరిశోధనల ద్వారా 21వ శతాబ్దం మధ్యలో సమాజం పతనం అవుతుందని శాస్త్రవేత్తల టీమ్ అంచనా వేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం మానవ జాతి అంతరించిపోవడానికి రెండు దశాబ్దాల కన్నా తక్కువ సమయం మిగిలి ఉందని చెబుతున్నారు. కచ్చితమైన అంచనాలు వేస్తే 2040లో పతనం జరుగుతుందని అంటున్నారు. అంటే ఇంకా 16 సంవత్సరాలు మాత్రమే ఉంది. మరి ఇది నిజం అవుతుందా..అబద్ధమవుతుందా..అనేది తెలుసుకోవడానికి అప్పటి దాక వేచిచూద్దాం.