
అమెరికా న్యూజెర్సీ లోని ఎడిసన్ లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ” దీపావళి- 2022 ” వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. కాగా ఇదే వేడుకలో డాక్టర్ శివకుమార్ ఆనంద్ ను కూడా ఘనంగా సన్మానించారు. ఫోటో జర్నలిస్ట్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రభ , ఇండియన్ ఎక్స్ ప్రెస్ , డెక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి , ద వీక్ ,ఇండియా టుడే తదితర ప్రింట్ మీడియాలలో పని చేసారు. అలాగే అమెరికాలో కూడా V6 , TV 9 , TV 5 , NTV , sakshi తదితర ఛానల్స్ కు ఫ్రీలాన్సర్ గా సేవలు అందించారు.
వీటితో పాటుగా అమెరికాలో ఉంటున్న పలు ప్రవాసాంధ్ర సాంస్కృతిక సేవా సంస్థలైన TFAS, TANA , ATA , NATA , NATS , TAGDV , TLSA లాంటి అన్ని అన్ని సంస్థలకు సేవలు అందించారు. రెండు దశాబ్దాలకు పైగా అమెరికాలో సేవలు అందిస్తూ మృదుస్వభావిగా , స్నేహశీలిగా , నిరంతర శ్రామికుడుగా పేరుగాంచారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. దాంతో ఆయన సేవలను గుర్తించిన తెలుగు కళా సమితి ( telugu fine arts society ) దీపావళి వేడుకలను పురస్కరించుకొని ఘనంగా సన్మానించింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటి గీత ,నటుడు ప్రిన్స్ , సింగర్స్ అనుదీప్ దేవ్ , శృతి రంజని లతో పాటుగా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తనను సన్మానించిన తెలుగు కళా సమితికి కృతఙ్ఞతలు తెలిపారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. ఈ కార్యక్రమానికి పలు సంస్థలతో పాటుగా జై యలమంచిలి నేతృత్వంలోని UBLOOD కూడా స్పాన్సర్ గా వ్యవహరించింది. తెలుగు కళా సమితి పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ శివకుమార్ ఆనంద్ JSW & Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ తో పాటుగా JSW & Jaiswaraajya.tv వెబ్ పేపర్స్ కు గ్లోబల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. విభిన్న అంశాలను స్పృశిస్తూ మీడియా రంగంలో తనకున్న అనుభవాన్ని రంగరించి ప్రత్యేకత చాటేలా కృషి చేస్తున్నారు.