TG Registration : రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు టీజీ గా అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. టీఎస్ నుంచి ఈజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో అంతా టీజీ అని రాసుకున్నామనీ ప్రజల మనోభావాలు మేర కు టీఎస్ ను టీజీ గా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అనిచి వేసిం దని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే టీఎస్ ను టీజీ గా మార్చారు. ఇకమీదట అన్ని వాహనా ల రిజిస్ట్రేషన్లు టీజీ అనే పేరుతో రిజిస్టర్ అవుతా యి. ఇప్పటివరకు టీఎస్ తో రిజిస్ట్రేషన్లు జరిగా యి. రేపటి నుంచి కొత్తగా కొనుగోలు చేసే వాహ నాలకు తప్పకుండా టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుంది.