Thalapathy Vijay : దేశంలో పౌరసత్వం సవరణ చట్టం తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికలకు ముందు చేసిన ఈ సంచలన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
2019 లోనే పౌర సవరణ చట్టం పార్లమెంటులో ఆమెదం పొందినప్పటికి ఇఫ్పటి వరకు అమలు కాకపోవడానికి ఏకైక కారణం..విదేశాల నుంచి వచ్చిన అన్ని మాతాల వారికి పౌ రసత్వం కల్పించి ఒక ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయిం చడంతో దేశంలో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటనను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివాస్పంద పౌరసత్వ సవరణ చట్టం పై తమిళ నటు డు, తమిళగ వెట్రి కళగం చీఫ్ దళపతి విజయ్ తీవ్రంగా ఖండించారు.
వివాస్పంద పౌరసత్వం సవరణ చట్టాన్ని అమలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ చట్టాన్ని తమిళనాడులో అమలు చేయవద్దు అని తమిళనాడు ప్రభుత్వానికి దళపతి విజయ్ విజ్ఞప్తి చేశారు.